ఈ చిత్రం రూ.2087 కోట్లు
ఆస్ట్రియన్ కళాకారుడు గుస్తాన్ క్లిమ్ట్ గీసిన ఓ చిత్రం రికార్డు స్థాయి ధర పలికింది. న్యూయర్క్‌లో నిర్వహించిన వేలంలో 'ఎలిజబెత్ లెడరర్' చిత్రం రూ.2087 కోట్లు పలికింది. దీంతో వేలంలో అమ్ముడైన ఖరీదైన రెండో కళాఖండంగా చరిత్రకెక్కింది. దీని కోసం ఆరుగురు పోటీ పడగా.. 20 నిమిషాల్లోనే వేలం ముగిసిందని నిర్వాహకులు తెలిపారు. అయితే ఎవరు సొంతం చేసుకున్నారనేది తెలపలేదు.