రేవంత్ VS లియోనెల్ మెస్సీ
HYD: ఉప్పల్ స్టేడియంలో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ ఇవాళ సందడి చేయనున్నారు. ఆయన రాక కోసం ఫుట్‌బాల్ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సాయంత్రం 7 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి, మెస్సీల మధ్య ప్రత్యేక పోటీ జరగనుంది. సింగరేణి RR-9కు సీఎం, అపర్ణ జట్ల తరఫున మెస్సీ ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు రాహుల్ గాంధీ కూడా HYD చేరుకోనున్నారు.