అదరగొట్టిన అర్జున్ టెండూల్కర్
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్ తనయుడు, గోవా ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తొలుత బౌలింగ్‌లో 3 వికెట్లతో సత్తాచాటిన అర్జున్.. అనంతరం బ్యాటింగ్‌లో 16 పరుగులు చేశాడు. కాగా MP 173 పరుగుల లక్ష్యాన్ని గోవా కేవలం 3 వికెట్లు కోల్పోయి 18.3 ఓవర్లలో ఛేదించింది.