'మార్చి 23న జరిగే బీసీల చలో ఢిల్లీ విజయవంతం చేయాలి'
HNK: మార్చి 23న జరిగే బీసీల ఢిల్లీ చలో విజయవంతం చేయాలని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ ఛైర్మన్, బీసీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆరేగంటి నాగరాజు గౌడ్ కోరారు. ఇవాళ కేయూలో ఆయన మాట్లాడుతూ.. కులగణనపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు. జనగణన గెజిట్లో ఎస్సీ, ఎస్టీ వివరాలు అడిగినా, బీసీ వివరాలు అడగకపోవడం అనుమానాస్పదమన్నారు.