'ఇళ్ల మధ్య మురుగు తొలగించండి'

MBNR: దేవరకద్ర పురపాలిక కొత్తకాలనీలో మురుగు కాలువలు లేక ఇళ్ల మధ్య మురుగునీరు నిలిచి, కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల మధ్య మురుగు నిలుస్తుండటంతో కాలనీవాసులు రోగాల భారిన పడుతున్నామాని, దోమలతో వ్యాధులు ప్రబలుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కాల్వలను ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.