కోనసీమ కొబ్బరి రైతులను ఆదుకోవాలి: ఎంపీ
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి రైతులను ఆదుకోవాలని పార్లమెంట్ వేదికగా కోరినట్లు అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యానవన వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు కొబ్బరి పంటలకు వెన్నెముక లాంటిదన్నారు. జిల్లాకు ప్రత్యేక కోకోనట్ డెవలప్‌మెంట్ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరానన్నారు. తద్వారా రైతులకు మేలు జరుగుతుందన్నారు.