దుబాయ్‌లో చేబ్రోలు యువకుడి మృతి

దుబాయ్‌లో చేబ్రోలు యువకుడి మృతి

కాకినాడ: గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన కోరగంటి నాగబాబు దుబాయ్‌లో గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. అయితే, తన కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేలా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోవాలని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ కోరుతున్నారు.