'మహా సభలను విజయవంతం చేయాలి'

ప్రకాశం: కనిగిరి పట్టణంలో సుందరయ్య భవనంలో సోమవారం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభల కరపత్రాన్ని ఆ సంఘ జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు ఆవిష్కరించారు. పాలకుల విధానాలతో వ్యవసాయ రంగం సంక్షోభంలోకి నెట్టబడిందని తెలిపారు. గిట్టుబాటు ధరలు లేక వ్యవసాయాన్ని వీడలేక రైతులు అల్లాడుతున్నారన్నారు. ఈనెల12,13 తేదీలలో కనిగిరిలో జరిగే జిల్లా మహా సభలను జయప్రదం చేయాలన్నారు.