కల్వర్టు గ్రిల్ లేక ప్రజల ఇబ్బందులు

కల్వర్టు గ్రిల్ లేక ప్రజల ఇబ్బందులు

KDP: ప్రొద్దుటూరులోని స్థానిక గాంధీ రోడ్డులో గల ప్రసాదరెడ్డి ఆస్పత్రి సర్కిల్ వద్ద కల్వర్టుకు గ్రిల్ లేక ప్రమాదాలు జరుగుతున్నాయి. పట్టణంలోనే అత్యధిక రద్దీ ఉండే ఈ ప్రాంతంలో కల్వర్టు గ్రిల్ దెబ్బతిని, పూర్తిగా ఊడి పోయినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.