రెండు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఆందోళన

రెండు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఆందోళన

GNTR: తుళ్లూరులో పారిశుద్ధ్య కార్మికులు గురువారం నిరసన తెలిపారు. రెండు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం సీఆర్‌డీఏ గ్రీవెన్స్ లో అర్జీ ఇస్తామని చెప్పారు. 47 మంది కార్మికులకు బదులు కేవలం 17 మందే పనిచేస్తున్నారని, దీంతో తమపై పనిభారం పెరిగిందని వాపోయారు. తమ జీతాన్ని రూ. 21 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.