పాఠశాలలకు గ్యాస్ కష్టాలు

పాఠశాలలకు గ్యాస్ కష్టాలు

VZM: గ్యాస్ కష్టాలు ఇప్పుడు పాఠశాలలవైపు చూస్తున్నాయి. విజయనగరంలోని ఓ పాఠశాలలో 270 మంది విద్యార్థులు ఉండగా, వంటకు మాత్రం ఒకే గ్యాస్ బండ మిగిలింది. దీంతో విద్యార్థులకు భోజనం కట్టెల పొయ్యి మీద చేస్తున్నారు. అయితే, గతంలో నెలకు మూడు గ్యాస్ బండలు ఉపయోగిస్తుండగా, ప్రస్తుతం గ్యాస్ దొరుకుతుందో లేదో అని కట్టెల పొయ్యి ఉపయోగిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.