తెలంగాణ ఫోక్ యూట్యూబ్ నిర్మాతల సమావేశం
SRCL: వేములవాడ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం తెలంగాణ ఫోక్ యూట్యూబ్ నిర్మాతల సంఘం సమావేశం నిర్వహించారు. వేములవాడకు చెందిన నిర్వాహకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి భారీ సంఖ్యలో ఫోక్ యూట్యూబ్ నిర్మాతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా యూట్యూబ్ జానపద నిర్మాతలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు.