గ్రావెల్ రవాణా ఇష్టానుసారంగా కొనసాగుతోంది: ప్రతాప్

WGL: వెంకటాపురం మండలం ఎదిర గ్రామంలో గోండ్వానా సంక్షేమ పరిషత్ నేతలు గురువారం సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు పూనం ప్రతాప్ హాజరై మాట్లాడుతూ.. మండలంలో గ్రావెల్ రవాణా ఇష్టానుసారంగా కొనసాగుతుందని ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకోని వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.