ప్రతి అర్జీని సంతృప్తికరంగా పరిష్కరించాలి: కలెక్టర్
KRNL: ప్రజల నుంచి వచ్చే ప్రతి వినతిని సంతృప్తి స్థాయిలో పరిష్కరించేలా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ డా.ఏ.సిరి అన్నారు. కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్‌తో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.