రెండో రోజుకు చేరిన మున్సిపాలిటీ పారిశుధ్య సామూహిక దీక్షలు

రెండో రోజుకు చేరిన మున్సిపాలిటీ పారిశుధ్య సామూహిక దీక్షలు

ATP: గుంతకల్లు మున్సిపాలిటీ సమీపంలో మున్సిపల్ ఇంజనీరింగ్, పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చేస్తున్న సామూహిక దీక్షలు శనివారం 2వ రోజుకి చేరాయి. వీరికి ఎస్ఎఫ్ఐ నాయకులు మద్దతు తెలిపి సంఘీభావం తెలిపారు. పట్టణ కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.