పేకాట స్థావరాలపై పోలీసులు దాడి.. 10 మంది అరెస్ట్

పేకాట స్థావరాలపై పోలీసులు దాడి.. 10 మంది అరెస్ట్

WGL: పట్టణ కేంద్రంలోని శివనగర్‌లో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో ఆదివారం అర్ధరాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.1 లక్ష నగదు, 10 మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకుని, 10 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిని తదుపరి చర్యల కోసం మిల్స్ కాలనీ పోలీసులకు అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు.