పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
HNK: ప్రేమ పేరుతో బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది. మడికొండ టేకులగూడేనికి చెందిన రఫి(ఆకాశ్) నేరానికి పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో, హన్మకొండ మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి బి.అపర్ణాదేవి సంచలన తీర్పునిచ్చారు. నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.14వేల జరిమానా విధించారు.