ట్రాఫిక్ సమస్యపై ఎమ్మెల్యే పరిశీలన

ట్రాఫిక్ సమస్యపై ఎమ్మెల్యే పరిశీలన

GNTR: గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవి గురువారం  శ్యామలనగర్ గేట్ వద్ద తీవ్ర ట్రాఫిక్ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ట్రాఫిక్ సిఐ సింగయ్యతో మాట్లాడుతూ.. రద్దీ తగ్గించడానికి పలు సూచనలు చేశారు. గుంటూరు నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూనే ఉంటుందని ఆమె తెలిపారు.