రహదారిపై పొంచి ఉన్న ప్రమాదం
SKLM: సోంపేట మండలం పాలవలస గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ప్రమాదం పొంచి ఉంది. జాతీయ రహదారి నుంచి సర్వీస్ రోడ్డు ప్రవేశ స్థలం వద్ద 33 కేవి విద్యుత్ స్తంభాల మధ్య దూరం ఎక్కువగా ఉండడంతో కరెంట్ తీగలు కిందకు వేలాడుతున్నాయి. రాత్రి వేళల్లో భారీ వాహనాలు వస్తే ప్రమాదం సంభవించే పరిస్థితి ఉందని సంబంధిత అధికారులు సరిచేయాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.