ఆలయ నిర్మాణానికి రూ. లక్ష విరాళం
KMR: గాంధారి మండలం గుర్జల్ తండాలో నిర్మిస్తున్న హనుమాన్ ఆలయ నిర్మాణానికి మహారాష్ట్రకు చెందిన పరశురాం మహారాజ్ నిన్న సాయంత్రం రూ. లక్ష విరాళంగా అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులకు ఆయన ఈ మొత్తాన్ని అందించారు. ఆంజనేయ స్వామి ఆలయం నిర్మించడం అభినందనీయమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికీ ఉండాలని ఆకాంక్షించారు.