ప్రతి గ్రామంలో 50 మంది కూలీలు పని చేయాలి : ఎంపీడీవో

ప్రతి గ్రామంలో 50 మంది కూలీలు పని చేయాలి : ఎంపీడీవో

WGL: పర్వతగిరి మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం 50 మంది కూలీలతో ఉపాధి హామీ పనులు ప్రారంభించాలని ఎంపీడీవో శంకర్ నాయక్ సోమవారం ఆదేశించారు. కూలీల హాజరు నమోదులో లోపాలు ఉంటే సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉపాధి కూలీలకు రూ.307 వేతనం వచ్చేలా పనులు చేయించాలని తెలిపారు.