బీసీ హాస్టళ్లకు నిధులు కేటాయించాలని ఎంపీకి విజ్ఞప్తి
KRNL: కర్నూలు రూరల్ మండలం పంచలింగాలలోని ఎంపీ బస్తిపాటి నాగరాజును జిల్లా బీసీ సంక్షేమ అధికారి ప్రసూన బుధవారం కలిశారు. బీసీ వసతి గృహాల మరమ్మతులు, మౌలిక సదుపాయాల మెరుగుదలకు నిధులు కేటాయించాలని కోరారు. ఎంపీ నాగరాజు బీసీ విద్యార్థుల సౌకర్యార్థం ఇప్పటికే రూ.కోటిని ఎంపీ నిధుల ద్వారా కేటాయించి అవసరమైన పనులు చేపట్టినట్లు తెలిపారు.