అడెల్లి పోచమ్మ ఆలయానికి 35 లక్షల ఆదాయం

NRML: సారంగాపూర్ మండలం అడెల్లి పోచమ్మ ఆలయానికి వేలంపాట ద్వారా భారీగా ఆదాయం సమకూరింది. ఆలయ ప్రాంగణంలో కొబ్బరికాయలు, పేలాలు, బొమ్మలు, సీడీలు, టోల్ టాక్స్ హక్కుల కోసం నిర్వహించిన వేలంలో రూ.35,33,000 ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు. ఈ హక్కులు పొందిన వారికి మంగళవారం నేటి నుంచి ఏడాది వరకు కాలపరిమితి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.