బాలుడి అదృశ్యంపై కేసు నమోదు
E.G: కొవ్వూరుకి చెందిన రావురోలు నాగ ఏడుకొండలు(15) అదృశ్యంపై గురువారం సాయంత్రం కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ పీ. విశ్వం తెలిపారు. ఈ నెల 25వ తేదీన పట్టణంలోని సంస్కృత పాఠశాలకు వెళ్లిన బాలుడు తిరిగి ఇంటికి రాకపోవడంతో ఎక్కడ ఆచూకీ లభించలేదన్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు సీఐ మీడియాకు వివరించారు.