మనస్తాపంతో వివాహిత సూసైడ్

MDK: మనస్తాపంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాలిలా.. అమ్రియా తండాకు చెందిన లునావత్ లక్ష్మి(40), గోపాల్ దంపతులు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. భార్యా, భర్తల మధ్య గొడవలతో మనస్తాపం చెందిన లక్ష్మి గురువారం పురుగు మందు తాగింది. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది.