మందుబాబులకు భారీ జరిమానా
SDPT: సిద్దిపేటలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ 26 మంది మందుబాబులకు కోర్టు భారీ జరిమానా విధించింది. ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ వారికి స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కాంతారావు రూ.2,65,000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.