గడువు విధించే వరకు వెనక్కి తగ్గం: సీఎం
అసెంబ్లీలు ఆమోదించి పంపించిన బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు న్యాయస్థానాలు గడువు విధించలేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనిపై తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. బిల్లులపై నిర్ణయం తీసుకునేలా గవర్నర్లకు గడువు విధించేలా రాజ్యాంగ సవరణ చేసేవరకు పోరాడతామని వెల్లడించారు. సుప్రీం అభిప్రాయం వల్ల తమిళనాడు కేసు తీర్పుపై ఏ ప్రభావం ఉండబోదని అన్నారు.