విద్యార్థులకు పోక్సో చట్టంపై అవగాహన

విద్యార్థులకు పోక్సో చట్టంపై అవగాహన

గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పలపాడు గ్రామ హైస్కూల్లో  ఇవాళ విద్యార్థులకు శక్తి యాప్‌తో పాటు పోక్సో చట్టంపై పోలీసులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పిల్లలపై లైంగిక నేరాల నుంచి రక్షణకు పోస్కో చట్టం ఉద్దేశ్యమని, వేధింపులు ఎదురైతే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఇందులో భాగంగా సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.