'స్కూల్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలి'
WNP: జిల్లాలో ఇటీవల ఓ ప్రైవేటు స్కూల్లో విద్యార్థిపై పాఠశాల సిబ్బంది అత్యాచార యత్నం చేసిని విషయం తెలిసిందే. దీంతో సదరు స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని 'ఆల్ మే వా' చైర్మన్ షేక్ ఫరూక్ హుస్సేన్ డిమాండ్ చేశారు. ఇవాళ బాధిత కుటుంబాన్ని పరామర్శించి మనో ధైర్యాన్ని అందించారు. అనంతరం మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే కుటుంబానికి న్యాయం చేసి, స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలన్నారు.