ప్రభుత్వాసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
కృష్ణా: గుడివాడ బస్టాండ్‌లో గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో పడి ఉన్న వ్యక్తిని 108 సిబ్బంది ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇతను ఉయ్యూరు ప్రాంతానికి చెందిన షబ్బీర్‌గా పోలీసులు భావిస్తున్నారు. ఇతని ఆచూకీ తెలిసినవారు గుడివాడ టూ టౌన్ స్టేషన్‌లో సంప్రదించాలని తెలిపారు.