VIDEO: రంగంపేటలో ట్రాక్టర్ నడిపిన ఎమ్మెల్యే
E.G: జీఎస్టీ సంస్కరణల నేపథ్యంలో వాహనాల ధరలు తగ్గడంతో రంగంపేటకు చెందిన రైతులు కోతుల పద్మారావు కంటిపూడి శ్రీనివాసులు నూతనంగా ట్రాక్టర్లను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా రంగంపేటలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వద్ద శుక్రవారం వారు తగ్గిన ధరలపట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారితో కలిసి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గ్రామంలో ట్రాక్టర్ నడిపారు.