BREAKING: అంగన్వాడీలో గ్యాస్ లీకై చెలరేగిన మంటలు
RR: నగరంలో అగ్ని ప్రమాదాలు రోజురోజుకు పెరిగి పోతున్నాయి. తాజాగా, కొందుర్గులోని అంగన్వాడీ కేంద్రం-1లో గ్యాస్ లీకై అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, స్థానికుల సహాయంలో మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.