VIDEO: సివిల్ సప్లై కార్యాలయం వద్ద ఆందోళన

కోనసీమ: ముమ్మిడివరలో ఉన్న జిల్లా సివిల్ సప్లై కార్యాలయం వద్ద సోమవారం మాలమహానాడు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. స్మార్ట్ రేషన్ కార్డులలో అంబేద్కర్ కోనసీమ జిల్లాకు బదులు తూర్పుగోదావరి జిల్లా అని పేరు ముద్రించడపై కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే పేరు మార్చాలని డిమాండ్ చేశారు. నాతి శ్రీనివాసరావు, సాధనాల శ్రీను పాల్గొన్నారు.