ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఎన్నికల కోడ్ అమలు: కలెక్టర్

ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఎన్నికల కోడ్ అమలు: కలెక్టర్

ఖమ్మం జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంతవరకు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి (MCC) అమలులో ఉంటుందని చెప్పారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.