దేవరకద్రలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

దేవరకద్రలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

MBNR: మహబూబ్‌నగర్ జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేవరకద్రలో అత్యధికంగా 38.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గండీడు (36.0), భూత్పూర్ (35.7), కోయిలకొండ (35.6) మండలాల్లోనూ ఎండ ప్రభావం అధికంగా ఉంది. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు.