VIDEO: వాట్సాప్ ద్వారా వైద్యం.. వ్యక్తి మృతి

VIDEO: వాట్సాప్ ద్వారా వైద్యం.. వ్యక్తి  మృతి

KKD: సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఒక వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. సామర్లకోటకు చెందిన మలిరెడ్డి చక్రంకు శుక్రవారం రాత్రి గుండెపోటు రావడంతో బంధువులు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ అందుబాటులో లేక డ్యూటీలో ఉన్న సిబ్బంది డాక్టర్ సలహా మేరకు వాట్సాప్‌లో వైద్యం అందించారు. కానీ వైద్యం వికటించడంతో వ్యక్తి మృతి చెందాడు.