బాలిక ఆశ్రమ పాఠశాలకు విరాళం
ASR: అరకులోయ మండలంలోని కొత్త బల్లుగూడ బాలిక ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం జరిగిన తల్లితండ్రులు-ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశంలో టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు శెట్టి బాబురావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో కళావేదిక లేకపోవడం గమనించిన ఆయన, తన వంతు సహకారంగా రూ. 50,000 విరాళాన్ని పాఠశాల యాజమాన్యానికి అందించారు.