ఈనెల 20న అనకాపల్లిలో పర్యటించనున్న సీఎం
AKP: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 20వ తేదీన అనకాపల్లిలో పర్యటించనున్నట్లు నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త పీలా గోవిందు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అనకాపల్లి నియోజకవర్గంలో నిర్వహించనున్న స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని పేర్కొన్నారు. అనకాపల్లి, కసింకోట మండలాల్లో ఏదో ఒక గ్రామంలో పర్యటిస్తారని తెలిపారు.