భార్యతో ఘర్షణపడి.. భర్త ఆత్మహత్య

భార్యతో ఘర్షణపడి.. భర్త ఆత్మహత్య

JN: భార్యతో ఘర్షణ పడి పురుగు మందు తాగి భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జనగామ జిల్లా జఫర్ఢ్ మండలంలో జరిగింది. ఎస్సై రామ్ చరణ్ వివరాల ప్రకారం.. గువ్వలగూడేనికి చెందిన శిరీష, దేవేందర్ (28)లకు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. శనివారం మధ్యాహ్నం భోజన సమయంలో వంట విషయంలో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. క్షణికావేశానికి గురై పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.