బాబోయ్ డంప్.. కొడుతుంది కంపు
BDK: పాల్వంచలోని వనమా కాలనీ చెరువు కట్ట వ్యర్థాల డంపింగ్ కేంద్రంగా మారింది. గుర్తు తెలియని వ్యక్తులు రాత్రివేళ భవన వ్యర్థాలు, చెత్త, సెప్టిక్ ట్యాంక్ మురుగు యథేచ్ఛగా పడేస్తుండటంతో దుర్వాసన వ్యాపిస్తోంది. దీంతో అటుగా వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.