అంబులెన్స్‌లోనే ప్రసవం.. మగ బిడ్డకు జన్మ

అంబులెన్స్‌లోనే ప్రసవం.. మగ బిడ్డకు జన్మ

సత్యసాయి: బుక్కపట్నం మండలం కింకిరివాండ్లపల్లి గ్రామానికి చెందిన మేఘన అనే గర్భిణి మహిళకు శుక్రవారం ఉదయం అకస్మాత్తుగా ప్రసవ వేదనలు ప్రారంభమయ్యాయి. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ముదిగుబ్బ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (పీహెచ్‌సీ) తరలించేందుకు అంబులెన్స్‌ను పిలిపించారు. అయితే ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యంలోనే అంబులెన్స్‌లో ఆమెకు మగ బిడ్డ ప్రసవం జరిగింది.