తొలి అమరుడు దొడ్డి కొమరయ్య: కలెక్టర్

BDK: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. శుక్రవారం కొత్తగూడెం ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో దొడ్డి కొమరయ్య వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా కొమరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అతని జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.