VIDEO: వనపర్తిలో నిలిచిన ప్రగతి రథాలు.. సమ్మే సైరన్
WNP: ఆర్టీసీ కార్మికుల సమ్మెతో వనపర్తిలో రవాణ వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. మంగళవారం నుంచి కార్మికులు విధులను బహిష్కరించడంతో డిపో లోని 72 ప్రభుత్వ, 44 ప్రవేట్, 7 ఎలక్ట్రిక్ బస్సులు షెడ్డుకే పరిమితమయ్యాయి. మొత్తం 123 బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 300మంది పైగా సిబ్బంది సమ్మెలో పాల్గొనడంతో డిపో వెలవెలబోతోంది.