VIDEO: తృటిలో తప్పిన ప్రమాదం
కోనసీమ: మామిడికుదురు మండలం అప్పనపల్లిలో బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. పెదపట్నంలంక నుంచి వస్తున్న కారు, ఎదురుగా వస్తున్న మోటార్ సైకిల్‌ను తప్పించబోయి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో కరెంటు స్తంభం విరిగిపడిపోయింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.