IPOకి ఫిన్‌టెక్ కంపెనీ
ఫిన్ టెక్ దిగ్గజం పైన్ ల్యాబ్స్ తమ పబ్లిక్ ఇష్యూ కోసం సిద్ధమైంది. ఈ ఇష్యూ నవంబర్ 7న ప్రారంభమై 11న ముగియనుంది. దీని ద్వారా కంపెనీ రూ.2,080 కోట్లు సమీకరించనుంది. డిజిటల్ చెల్లింపుల ప్రాసెసింగ్ సేవలందించే పైన్ ల్యాబ్స్‌కి భారత్‌తో పాటు మలేషియా, యూఏఈ, సింగపూర్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో కూడా కార్యకలాపాలు ఉన్నాయి.