తుఫాన్ ఎఫెక్ట్.. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లు

తుఫాన్ ఎఫెక్ట్.. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లు

E.G: తుఫాన్ కారణంగా గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో ఒక పెంకుటిల్లు, ఇటికాయలపల్లి గ్రామంలో ఒక తాటాకు ఇల్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు మండల తహసీల్దార్ రామకృష్ణ బుధవారం తెలిపారు. రెవెన్యూ సిబ్బంది అచ్యుతాపురం గ్రామానికి, ఇటికాయలపల్లి గ్రామానికి వెళ్లి పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.