మంత్రి నేటి పర్యటన వివరాలు
NLG: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ నల్గొండ పట్టణంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన క్యాంపు కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఉదయం 11 గంటలకు పట్టణంలోని ఇందిరా భవన్ లో ప్రజల నుంచి వినతులు స్వీకరించి, అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు కలెక్టరేట్‌లో ఇందిరా మహిళా శక్తి చీరలను అందజేసి, లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయనున్నారు.