వరద ఉధృతి పెరగడంతో రాకపోకలు బంద్
SKLM: సంతబొమ్మాళి మండలంలో గల తోటాడ - కోటబొమ్మాళి రైల్వే స్టేషన్ల మధ్య మంగళగెడ్డలో వర్షం వరద నీరు ఉప్పొంగింది. దీంతో ఆయా గ్రామాల మధ్య ఉన్నప్రజలు రాకపోకలు మంగళవారం నిలిచిపోయాయి. ఆ గ్రామం నుంచి ఉదయం 6 గంటలకు కోటబొమ్మాళి రైల్వే స్టేషన్‌కు పలువురు ప్రయాణికులు డిఎంయు ట్రైన్‌కు వెళ్లేందుకు బయలుదేరారు. నీటి ప్రవాహం పెరగడంతో వెళ్లేందుకు వీలు పడలేదు.