పురుగు మందు తాగి యువకుడి ఆత్మహత్య
ASF: రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన ముంజం సంతోష్ ఆదివారం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగాపూర్ గ్రామానికి చెందిన సంతోష్ పురుగు మందు తాగడంతో కుటుంబ సభ్యులు రెబ్బెన ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం బెల్లంపల్లికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు.