ఆర్డీఓ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

కోనసీమ: రామచంద్రపురం ఆర్డీవో ఆఫీస్‌లో శుక్రవారం స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్డీవో దేవరకొండ అఖిల జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. శాంతికి, ధర్మానికి ప్రతీకగా నిలిచే దేశం మనదని కొనియాడారు. రానున్న రోజుల్లో భారతదేశం సూపర్ పవర్‌గా అవతరిస్తుందన్నారు. దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు పాల్గొనాలని పిలుపునిచ్చారు.